కలం, వెబ్ డెస్క్: మహిళల బాధలో అండగా నిలబడి ధైర్యాన్ని ఇచ్చే సామాజిక బాధ్యత అందరిపైన ఉందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. హైదరాబాద్‌లోని ఐసీసీసీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజా ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందని సీఎం తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లను మహిళలపేరుతో ఇస్తున్నామని చెప్పారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. స్పందన (SPANDANA) కార్యక్రమం ద్వారా తక్షణమే బాదిత మహిళలకు మానసిక భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ల కోసం 2013 లోనే బిల్లును కాంగ్రెస్ ఆమోదించిందని సీఎం వివరించారు.
ఇప్పటికి కొన్ని విషయాల్లో మహిళలపైన వివక్ష ఉందన్నారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే మహిళలకు రక్షణ కల్పించాలని.. పిల్లలకు భద్రత ఇవ్వాలని తమ ప్రభుత్వం భావించిందని చెప్పారు. అభద్రతకు గురైన మహిళలకు అండగా ఉండాలని ‘స్టాండ్ విత్ హర్’ అనే కార్యక్రమాన్ని తీసుకున్నామని తెలిపారు. మరో అడుగు ముందుకు వేసి స్పందన పేరుతో 24గంటల పాటు అందుబాటులో ఉండేలా టీమ్స్ ను ఏర్పాటు చేశామన్నారు.
అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళలు, పిల్లలకు భద్రత, రక్షణ కల్పించడం ప్రభుత్వాలు బాధ్యతగా భావిస్తాయని సీఎం చెప్పారు. ఏ దేశాల్లో పిల్లలు, మహిళలకు రక్షణ కల్పిస్తున్నారో అక్కడ అభివృద్ధి వేగంగా జరుగుతుందని అభిప్రాయపడ్డారు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెంటనే మహిళలకు ఓటు హక్కు కల్పించారని.. అమెరికాలో మహిళలకు ఓటు హక్కు ఇవ్వడానికి 150 యేళ్లు పట్టిందన్నారు. దేశం అభివృద్ధిలో మహిళలను పురుషులతో పాటుగా సమాన హక్కులను తొలి ప్రధాని నెహ్రూ కల్పించారని గుర్తు చేశారు. దేశ ప్రధానిగా, లోక్ సభ స్పీకర్ గా, రాష్ట్రాల గవర్నర్లు, న్యాయమూర్తులుగా మహిళలకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిందన్నారు. మహిళా విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లతో పాటు స్థానిక సంస్థల్లో కూడా మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చి పరిపాలనలో కాంగ్రెస్ భాగస్వామ్యం చేసిందని వివరించారు.
Read Also: నాగార్జునసాగర్ డ్యామ్ భద్రతపై సిఆర్‌పిఎఫ్ నిర్లక్ష్యం
Follow Us On: WhatsApp

