కలం, నాగార్జునసాగర్ : తెలంగాణలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా భావించే నాగార్జునసాగర్ (Nagarjuna Sagar Dam) డ్యామ్ భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. డ్యామ్ భద్రత కోసం నియమించిన సిఆర్‌పిఎఫ్ (CRPF) సిబ్బంది విధులను పక్కన పెట్టి చేపల వేటలో పాల్గొన్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. వెంటనే స్పందించిన అధికారులు క్రమశిక్షణ తప్పిన 60 మంది సిబ్బందిని బదిలీ చేస్తూ చర్యలు తీసుకున్నారు.
డ్యామ్ భద్రతా నిబంధనల ప్రకారం పరిసర ప్రాంతాల్లో 5 కిలోమీటర్ల వరకు చేపల వేటపై కఠిన నిషేధం ఉంది. అయినప్పటికీ, యూనిఫాంలో ఉన్న సిఆర్‌పిఎఫ్ జవాన్ కంట్రోల్ రూమ్ ఎదురుగా క్రస్ట్ గేట్ల వద్ద గాలం వేసి చేపలు పట్టిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. దీంతో ఉన్నతాధికారులు స్పందించి, 60 మంది జవాన్‌లను నాగార్జునసాగర్ (Nagarjuna Sagar Dam) నుంచి విశాఖపట్నం బెటాలియన్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరి స్థానంలో కొత్తగా మరో 60 మంది సిబ్బందిని నియమించారు. ఒక్కరి నిర్లక్ష్యం కారణంగా మొత్తం బృందంపై చర్యలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కీలక భద్రతా ప్రాంతంలో ఇలాంటి నిర్లక్ష్యం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Read Also: మూకుమ్మడి దాడి.. అయినా TRS లో సోలో వాయిస్
Follow Us On: WhatsApp

