Mobile Popup Ad
Mobile Popup Ad

మళ్లీ పుట్టిన ‘టీఆర్ఎస్’.. పేరు, జెండా వెనుక కవిత స్ట్రాటజీ ఏంటి?

కలం, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో టీఆర్ఎస్ (TRS) మళ్లీ పుట్టింది. కానీ, దాని పేరు మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితి కాదు.. తెలంగాణ రాష్ట్ర సేన (Kavitha TRS)! అప్పటి టీఆర్ఎస్ సృష్టికర్త కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. ఇప్పటి టీఆర్ఎస్ వ్యవస్థాపకురాలు ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha). పార్టీ పేరు ఏదైనా టీఆర్ఎస్ అనే మూడక్షరాల అబ్రివేషన్ మాత్రం కల్వకుంట్ల ఫ్యామిలీకే చెందాలనే ఫార్ములా వర్కవుట్ అయింది. నాడు తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంలో టీఆర్ఎస్ అనే పదం ప్రజల తలలో నాలుకలాగా స్థిరపడింది. ఇప్పుడు కవిత పెట్టిన కొత్త పార్టీతో మరోసారి ఆ పదం తెరమీదికి వచ్చింది.

టీఆర్ఎస్ వ్యవస్థాపకుడు కేసీఆర్ తన పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా 2022లో మార్చుకున్నారు. దీంతో టీఆర్ఎస్ అనే పదం బీఆర్ఎస్ గా మారిపోయింది. నాలుగేండ్లుగా టీఆర్ఎస్ అనే పదమే ఉనికిలో లేదు. సరిగ్గా దాన్ని కవిత అందిపుచ్చుకున్నారు. పార్టీ పేరులోనే కాకుండా జెండాలోని రంగులనూ వ్యూహం ప్రకారం ఎంపిక చేసుకున్నారు. ఎస్సీ, బీసీలకు దగ్గరయ్యేలా నీలం రంగు, బీఆర్ఎస్‌లోని పూర్వ తెలుగుదేశం లీడర్లు, కేడర్‌ను ఆకర్షించేలా పసుపు రంగును సెలెక్ట్ చేసుకున్నారు. ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, మహిళలు, యువత.. ఇలా వివిధ సెక్షన్ల ఓటర్లకు దగ్గరయ్యేలా ఫైవ్ గ్యారంటీస్ తరహాలో హామీలు గుప్పించారు. మహిళ నేతృత్వంలో పురుడు పోసుకున్న టీఆర్ఎస్ మూడు ప్రధాన పార్టీలనూ టార్గెట్ చేస్తున్నది. తండ్రి పెట్టిన టీఆర్ఎస్ అబ్రివేషన్‌ను వాడుకుంటూనే ఆయననే కవిత విమర్శిస్తున్నారు.

టీఆర్ఎస్ అనే మూడక్షరాల కొత్త పార్టీ కవితకు అడ్వాంటేజ్ అవుతుందా? కాపీ కొట్టారన్న నెగెటివ్ ప్రాపగండా డిస్ అడ్వాంటేజ్ అవుతుందా? ఓట్లను చీల్చే పాత్రకే ఆ పార్టీ పరిమితవుతుందా? బీఆర్ఎస్‌కు ఆల్టర్నేట్‌గా మారుతుందా? ‘టీఆర్ఎస్’ అబ్రివేషన్ ఎంపిక వెనక ఆమె వ్యూహమేంటి? టీఆర్ఎస్ పేరుతో ఉన్న లీగల్ చిక్కులను అధిగమించడానికి కవిత స్ట్రాటజీ ఏంటి? వీటిపై కలం ప్రత్యేక కథనం చదివేందుకు కింద ఉన్న పేపర్ ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Kavitha TRS
Kavitha TRS

Read Also: రీల్స్ క్రేజ్ : ప్రాణాలు కోల్పోతూ.. ఇతరుల ప్రాణాలు తీస్తున్న యూత్​

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>