Mobile Popup Ad
Mobile Popup Ad

ఆంధ్ర యూనివర్సిటీకి రూ.500 కోట్లు: సీఎం చంద్రబాబు

కలం, వెబ్ డెస్క్: విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ (Andhra University) శతాబ్ధి వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు (Chandrababu) వర్సిటీ అభివృద్ధికి రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఏయూకి ప్రపంచ వ్యాప్తంగా గొప్ప గుర్తింపు ఉందని.. ఎందరో మేధావులు, శాస్త్రవేత్తలు ఇక్కడి నుంచే వచ్చారని వివరించారు. నోబెల్ బహుమతి గెల్చుకున్న సర్ సీవీ.రామన్ సైతం ఇక్కడే చదువుకున్నారని గుర్తు చేశారు. ఆంధ్ర యూనివర్సిటీలో చదివి దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న వారు, ప్రస్తుతం పనిచేస్తున్న ప్రొఫెసర్లు కలిసి మరో రూ.500 కోట్లు ఇవ్వాలని పిలుపునిచ్చారు. అంతా కలిసి ముందుకొస్తే.. ఈ నిధి సమకూరడం పెద్ద విషయం కాదన్నారు. రూ.1000 కోట్లతో అభివృద్ధి చేస్తే, యూనివర్సిటీ ప్రపంచ స్థాయికి వెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అప్పుడు ఐటీ.. ఇప్పుడు ఏఐ..

తాను 76 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా.. తన ఆలోచనలు 26 ఏళ్ల యువకుడి మాదిరి ఉంటాయని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. ఒకప్పుడు ఐటీ వెంటపడి హైటెక్ సిటీ కట్టించామని.. ఇప్పుడు ఏఐతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు. కూటమి ప్రభుత్వం వర్సిటీల అభివృద్ధికి కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు.

Read Also: జిల్లాలో పెట్రోల్ కొరత లేదు : నెల్లూరు కలెక్టర్

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>