కలం, సెంట్రల్ డెస్క్: Reels Craze | 2026 ఏప్రిల్.. హైదరాబాద్‌లోని మల్లాపూర్ బస్తీలో బిహార్‌కు చెందిన బాలుడు మిథున్ (14) బాల్కనీ గోడపై రీల్స్ చేస్తూ పట్టుతప్పి కిందపడిపోయాడు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరి, 15 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చనిపోయాడు.
2024 జులై.. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు ఫ్రెండ్స్ బైక్‌పై స్టంట్స్ చేస్తూ అదుపుతప్పి కిందపడిపోయారు. వీరిలో ఒకరు చనిపోగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
2024 జనవరి.. హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు స్నేహితులు కొండపోచమ్మ సాగర్‌కు వెళ్లారు. రిజర్వాయర్ లోపల సెల్ఫీలు దిగుతున్న క్రమంలో ఒకతను జారిపడి నీళ్లలో మునిగిపోయాడు. అతణ్ని కాపాడేందుకని ఒకరి తర్వాత ఒకరు వెళ్లి.. మొత్తం ఐదుగురు చనిపోయారు.
2023 మే.. హైదరాబాద్‌కు చెందిన మైనర్ మహమ్మద్ సర్ఫరాజ్ (16) ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం ఫ్రెండ్స్‌తో కలిసి సనత్‌నగర్‌లోని రైల్వే ట్రాక్ మీదికి వెళ్లాడు. రీల్స్ చేస్తున్న క్రమంలో ఎంఎంటీఎస్ ట్రైన్ ఢీకొని చనిపోయాడు. ఇలా ఒక్క తెలంగాణలోనే కాదు.. దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. వ్యూస్, లైక్‌లు, కామెంట్ల వెర్రితో ప్రాణాలు కోల్పోతూ.. ఇతరుల ప్రాణాలూ తీస్తున్నారు.
సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే పిచ్చితో యువత ప్రమాదకరమైన ప్రయోగాలు చేస్తున్నారు. రైళ్లకు అడ్డంగా వెళ్లడం, కొండలు, గుట్టలు ఎక్కి లోయల పక్కన ఫొటోలు దిగడం, జలపాతాల దగ్గర ఆటలాడడం, బిల్డింగ్‌లు ఎక్కి దూకడం, బైక్‌లపై రోడ్ల మీద స్టంట్లు చేయడం, కార్లు, బైక్‌లను వంద కి.మీల స్పీడ్‌తో నడపడం.. లాంటివి చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్నిసార్లు ఇతరుల ప్రాణాలు పోవడానికీ కారణమవుతున్నారు.
సోషల్ మీడియా ప్రమాదాలు ఇటీవల పెరిగిపోయాయి. అసలు పిల్లలు, యువత సోషల్ మీడియాకు అడిక్ట్ కావడానికి కారణాలేంటి? ఈ ‘డెత్ రీల్స్’ను అడ్డుకునేదెలా? తల్లిదండ్రులు, సోషల్ మీడియా సంస్థలు, ప్రభుత్వాలు ఏం చేయాలి? వీటన్నింటిపై కలం 360 డిగ్రీస్ స్పెషల్ కథనం చదివేందుకు కింద్ ఉన్న ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Read Also: కాలం కన్నా ముందు పుట్టిన పురాతన అడవులు.. మనం కూడా చూడొచ్చు..
Follow Us On: WhatsApp

