కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పరిపాలనా కారణాల దృష్ట్యా మల్టీ జోన్ 1 పరిధిలో పనిచేస్తున్న 15 మంది సివిల్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ (Telangana Police Transfers) పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఐజీపి కార్యాలయం అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది.
బదిలీ అయిన వారిలో బియ్యాని సంతోష్ రావును మహబూబాబాద్ సీసీఎస్ 2కు కేటాయించారు. జగిత్యాల మెట్‌పల్లి సర్కిల్‌లో ఉన్న బి. సురేష్ బాబు కరీంనగర్ సీఎస్‌బీ 2కు వెళ్లనున్నారు. కామారెడ్డి పీసీఆర్‌లో ఉన్న జగదాం నరేష్‌ను భిక్నూర్ సర్కిల్‌కు పంపగా, అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎం. సంపత్ కుమార్‌ను హైదరాబాద్‌లోని మల్టీ జోన్ 1 ఐజీపి కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. రామగుండం టాస్క్‌ఫోర్స్‌లో ఉన్న గంగాధర రమేశ్ బాబును రామగుండం సీఎస్‌బీ 3కి బదిలీ చేసి పెద్దపల్లి డబ్ల్యూపీఎస్‌కు అటాచ్ చేశారు. నిజామాబాద్ సీసీఎస్ 3లో ఉన్న పింగిలి మహేందర్ రెడ్డిని సిద్దిపేట టౌన్ 1 ఎస్‌హెచ్‌ఓగా నియమించారు. అక్కడ పనిచేస్తున్న ఎస్. వాసుదేవ రావును హైదరాబాద్ ఐజీపి కార్యాలయానికి బదిలీ చేశారు.
సిద్దిపేట రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మడుగుల శ్రీనును ఐజీపి కార్యాలయానికి బదిలీ చేస్తూ, ఆయన స్థానంలో చల్లా విద్యాసాగర్‌ను నియమించారు. రామగుండం లీగల్ సెల్‌లో ఉన్న వై. కృష్ణకుమార్‌ను రామగుండం సర్కిల్‌కు మార్చారు. సీఐడీ హైదరాబాద్‌లో ఉన్న కోటగిరి శ్రీధర్‌ను రామగుండం లీగల్ సెల్‌కు కేటాయించారు. కరీంనగర్ పీటీసీలో ఉన్న మంచినీళ్ల శ్రీనివాస్‌ను మహబూబాబాద్ టౌన్ ఎస్‌హెచ్‌ఓగా నియమించారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న బండారి రాజును వరంగల్ కమిషనరేట్‌కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో చల్లా రమేష్ బాబు బాధ్యతలు చేపట్టనున్నారు. జగిత్యాల వీఆర్‌లో ఉన్న కె. నరేష్‌ను ఆదిలాబాద్ పీసీఆర్‌కు కేటాయించారు. బదిలీ అయిన అధికారులు తక్షణమే తమ కొత్త ప్రాంతాల్లో విధుల్లో చేరాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
Read Also: భారీ ధరకు అమ్ముడైన అర్జున్ టెండూల్కర్!
Follow Us On: WhatsApp

