కలం, నిజామాబాద్ బ్యూరో : కామారెడ్డి (Kamareddy) పట్టణంలోని పాత బస్టాండ్ ఆవరణలో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. అనూహ్యంగా మంటలు చెలరేగి చుట్టుపక్కల ఉన్న దుకాణాలకు వేగంగా వ్యాపించాయి. ఈ ఘటనలో మొత్తం 12 షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగాయా లేదా మరేదైనా కారణమా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.50 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు దుకాణ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రభుత్వం నుంచి సహాయం అందించాలని వారు కోరుతున్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read Also: భారీ ధరకు అమ్ముడైన అర్జున్ టెండూల్కర్!
Follow Us On: WhatsApp

