Mobile Popup Ad
Mobile Popup Ad

వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవద్దు.. జగన్‌కు లోకేశ్ వార్నింగ్

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మరోసారి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కలియుగ దైవంగా భావించే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి విషయంలో రాజకీయాలు చేయొద్దని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh), మాజీ సీఎం వైఎస్ జగన్‌ (YS Jagan) కి  గట్టి హెచ్చరిక జారీ చేశారు. తిరుమల క్యూలైన్లలో ఉన్న భక్తులతో అబద్ధాలు చెప్పించే ప్రయత్నం జరుగుతోందని లోకేశ్ ఆరోపించారు. ‘క్యూలైన్లలో ఉన్న భక్తులు అన్ని ఏర్పాట్లు బాగున్నాయని చెబుతున్నప్పటికీ, అవి బాగా లేవని చెప్పించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు’ అని ఆయన అన్నారు.

ఈ నేపథ్యంలో ఓ ఛానల్ భక్తుల అభిప్రాయాలను మార్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తూ మంత్రి లోకేశ్ (Nara Lokesh) ఒక వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలో భక్తులను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. లోకేశ్  వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి.

Read Also: ఆకివీడు దిగ్బంధనం.. రామాలయ శంకుస్థాపన టెన్షన్

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>