కలం, వెబ్ డెస్క్ : 2026 గణతంత్య్ర దినోత్సవం (Republic Day 2026) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పోలీసు, అగ్నిమాపక, హోంగార్డు, రక్షణ సేవలకు సంబంధించి విశిష్ట సేవా పతకాలను ప్రకటించింది. దేశం మొత్తం 125 మందికి గ్యాలంటరీ అవార్డులు, 101 మందికి ప్రెసిడెంట్ మెడల్స్ దక్కగా.. 756 మందికి విశిష్ట సేవా పతకాలకు ఎంపికయ్యారు.
తెలంగాణలో ఉత్తమ సేవలు అందించి విశిష్ట సేవా పతకాలు అందుకోనున్న వారిలో 23 మంది పోలీసు అధికారులు ఉన్నారు. వీరిలో ఏసీపీ మంద జీ.ఎస్ ప్రకాశ్ రావు, ఎస్ఐ అన్ను దామోదర్ రెడ్డిలకు ప్రెసిడెంట్ మెడల్ దక్కగా.. హెడ్ కానిస్టేబుల్ మర్రి వెంకట్ రెడ్డి గ్యాలంటరీ అవార్డుకు ఎంపికయ్యారు. మరో 20 మంది పోలీసు అధికారులు విశిష్ట సేవా పథకాలు అందుకోనున్నారు.
Read Also: పద్మశ్రీ అవార్డులు ప్రకటించిన కేంద్రం
Follow Us On : WhatsApp


