epaper
Saturday, January 24, 2026
spot_img
epaper

నేను చెప్పినట్లుగానే కేంద్రం చేసింది : కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్​

కలం, వెబ్​ డెస్క్ : ఆపరేషన్​ సింధూర్​ (Operation Sindoor)కు ముందు తాను రాసిన ఆర్టికల్​ చెప్పినట్లుగానే కేంద్ర ప్రభుత్వం వ్యవహరించింది అని కాంగ్రెస్ సీనియర్​ నేత, ఎంపీ శశిథరూర్​ (Shashi Tharoor) కీలక వ్యాఖ్యలు చేశారు. కేరళ లిటరేచర్​ ఫెస్టివల్ లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్​ సిందూర్​ పైనే తనకు కాంగ్రెస్​ పార్టీతో బేదాభిప్రాయాలను ఉన్నాయని చెప్పారు. పార్లమెంట్లో తాను ఎప్పుడూ పార్టీ నియమావళిని ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు.

పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్​ సిందూర్​ తర్వాత పాకిస్థాన్​ ను ఎండగట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంపీలు, కేంద్ర మంత్రులతో కూడిన దౌత్య బృందాలను విదేశాలకు పంపిన విషయం తెలిసిందే. ఈ బృందంలో ఎంపీ శశి థరూర్​ (Shashi Tharoor) కూడా ఉన్నారు. ఆ సమయంలో ఆయన వ్యవహరించిన తీరు కాంగ్రెస్​ లో తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలో అప్పటి పరిస్థితులపై థరూర్​ క్లారిటీ ఇచ్చారు. తన వ్యవహార శైలిని సమర్థించుకుంటూ మనకు ఎప్పుడు మన దేశమే ప్రాధాన్యంగా ఉండాలని చెప్పారు.

ఈ సందర్భంగా ఆపరేషన్​ సింధూర్​ కు ముందు తాను రాసిన ఆర్టికల్​ గురించి ప్రస్తావించారు. పహల్గామ్ దాడికి సంబంధించి ఆర్టికల్​ రాశానని చెప్పారు. అందులో ఉగ్రదాడులకు సరైన సైనిక ప్రతిస్పందన ఉండాలని రాసినట్లు తెలిపారు. పాకిస్తాన్​ భారత్​ పై దీర్ఘకాలిక ఘర్షణలకు వెళ్లకుండా ఉగ్రశిబిరాలను లక్ష్యంగా పెట్టుకోవాలని అందులో సూచించినట్లు స్పష్టం చేశారు. అయితే, ఆర్టికల్​ లో తాను చెప్పినట్లుగానే కేంద్రం ప్రభుత్వం ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేయడం ఆశ్చర్యం కలిగించిందని శశిథరూర్ వెల్లడించారు. కాగా, గతకొన్ని రోజులుగా శశిథరూర్ కి కాంగ్రెస్​ పార్టీకి మధ్య అంతర్గత విభేదాలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్రమోడీని, బీజేపీని పొగడడం కూడా ఆయనపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత మొదలయింది. ఈ తరుణంలో మరోసారి శశిథరూర్ చేసిన​ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారే అవకాశం లేకపోలేదు.

Read Also: ఐఏఎస్, ఐపీఎస్ కేటగిరీపై కొత్త పాలసీ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>