కలం, తెలంగాణ బ్యూరో : ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ (ఫారెస్ట్ సర్వీస్) అధికారుల రిక్రూట్‌మెంట్, కేటగిరీ ఫిక్సేషన్‌పై కేంద్ర ప్రభుత్వం సరికొత్త పాలసీని (All India Services Cadre Policy ) విడుదల చేసింది. ఈ ఏడాది నుంచే ఇది అమల్లోకి రానున్నది. ఇంతకాలం ఉన్న ఐదు జోన్ల సిస్టమ్ స్థానంలో ఇక నుంచి నాలుగు గ్రూపుల విధానం అమలవుతుంది. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాతనే కేంద్ర డీవోపీటీ (DoPT) ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. గతంలో జోన్-5లో ఉన్న తెలంగాణ కొత్త విధానంతో నాల్గవ గ్రూపులో ఉంటుంది. రాష్ట్రాల పేర్లను ఆంగ్ల అక్షర క్రమంలో పరిగణనలోకి తీసుకున్న డీవోపీటీ ఈ గ్రూపుల విధానాన్ని ఖరారు చేసింది. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ మాత్రమే ఫోర్త్ గ్రూపులో ఉంటుంది. తమిళనాడు థర్డ్ గ్రూపులో ఉంటుంది. కర్ణాటక, కేరళ రాష్ట్రాలు మూడవ గ్రూపులో, ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ గ్రూపులో ఉంటాయి.
ఏడాది ముందే రాష్ట్రాల రిక్వెస్టు :
ప్రతీ రాష్ట్రానికి ఐఏఎస్, ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్‌ను డీవోపీటీ ఖరారు చేస్తున్నా ఎన్ని పోస్టులు భర్తీ కాకుండా ఖాళీగా ఉన్నాయో, గ్యాప్ ఎంత ఉన్నదో రాష్ట్ర ప్రభుత్వాలు సంవత్సరం ముందే రాతపూర్వకంగా తెలియజేయాలి. రాబోయే సంవత్సరంలో భర్తీ కావాలనుకున్న పోస్టుల సంఖ్యను, గ్యాప్ వివరాలను ముందు సంవత్సరం డిసెంబరు నాటికే డీవోపీటీకి పంపాలి. ఇన్‌సైడర్, ఔట్ సైడర్ ఆఫీసర్ల భర్తీ, రిజర్వేషన్ విధానం.. వీటన్నింటిపైనా ఆరు పేజీల పాలసీనలో డీవోపీటీ వివరణ ఇచ్చింది. ఆర్థికంగా వెనకబడిన తరగతుల (EWS) కేటగిరీని అన్ రిజర్వుడు విభాగంలోకి తీసుకెళ్ళనున్నట్లు తెలిపింది. ఐఏఎస్ బ్యాచ్‌ను ఖరారు చేసే ప్రక్రియ వారి ప్రొఫెషనల్ కోర్సు శిక్షణ ప్రారంభమయ్యేనాటికే పూర్తికావాలని స్పష్టత ఇచ్చింది. ఇప్పటివరకూ అమల్లో ఉన్న పాత విధానం ఈ సంవత్సరం (2026) సీఎస్ఈ (CSE) పరీక్షల నుంచి రద్దయ్యి కొత్త విధానమే అమల్లో ఉంటుందని నొక్కిచెప్పింది.
Read Also: మున్సిపల్ ఎన్నికల్లో పోటీపై కవిత సంచలన నిర్ణయం ?
Follow Us On: X(Twitter)


