Mobile Popup Ad
Mobile Popup Ad

కృష్ణానదిలో అన్నదమ్ములు గల్లంతు

కలం, నల్లగొండ బ్యూరో : సూర్యాపేట (Suryapet) జిల్లా చింతలపాలెంలో పెను విషాదం చోటుచేసుకుంది. సరదగా సెలవులు గడిపేందుకు వచ్చిన ఓ ఇద్దరు అన్నదమ్ములు చేపల వేట కోసం కృష్ణానదిలో నీటమునిగి చనిపోయారు. వివరాల్లోకి వెళితే.. చింత్రియాల గ్రామానికి చెందిన సమీర్ (15), సద్దాం (13) అన్నదమ్ములు. బుధవారం ఉదయం చేపల వేట కోసం కృష్ణానదికి వెళ్లారు. ఒక చిన్న పుట్టి (పడవ)లో నదిలోకి వెళ్లారు. నీటి ప్రవాహం ధాటికి పుట్టి అదుపుతప్పి బోల్తా పడటంతో ఇద్దరు బాలురు నదిలో మునిగిపోయారు. స్థానిక మత్స్యకారులు, గజ ఈతగాళ్లు వెంటనే రంగంలోకి దిగి నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. గంటల తరబడి గాలింపు తర్వాత ఇద్దరు బాలురు మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే వీరిద్దరూ ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరుపేటలోని ఒక మదర్సా (ఉర్దూ మీడియం స్కూల్)లో చదువుకుంటున్నారు. పాఠశాలకు సెలవులు ఇవ్వడంతో, రంజాన్ పండుగ జరుపుకోవడానికి స్వగ్రామమైన చింత్రియాలకు వచ్చారు. ఇద్దరు బాలురు నీటిలో మునిగి చనిపోవడంతో చింత్రియాల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>