epaper
Saturday, January 24, 2026
spot_img
epaper

ఇండియాపై టారిఫ్ లు తగ్గించబోతున్న అమెరికా..?

కలం, వెబ్ డెస్క్ : అమెరికా త్వరలోనే ఇండియా మీద టారిఫ్‌ లు (US Tariffs on India) తగ్గించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇండియా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై అమెరికా 25 శాతం డైరెక్ట్ గా, మరో 25 శాతం అదనంగా టారిఫ్ లు వేస్తోంది. వీటిని తగ్గించాలంటూ భారత్ ఎన్నో సార్లు సూచించినా అమెరికా పట్టించుకోలేదు. ప్రస్తుతం ఈ 25 శాతం అదనపు టారిఫ్ లను అమెరికా తగ్గించే ఆలోచనలో ఉన్నట్టు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ (Scott Bessent) చెప్పారు. దావోస్ లో జరుగుతున్న సదస్సులో ఆయన మీడియాతో మాట్లాడారు. తాము అదనంగా టారిఫ్‌ లు వేయడం వల్ల భారత్ రిఫైనరీలు రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లను భారీగా తగ్గించాయని.. ఇది తమకు పెద్ద విజయం అన్నారు. భారత్ ఇలాగే కొనసాగితే 25 శాతం టారిఫ్‌ లు తగ్గించే అవకాశాలు ఉన్నాయని బెసెంట్ తెలిపారు.

ప్రస్తుతం రష్యా (Russia) నుంచి కొనుగోళ్లు కుప్పకూలాయని.. తమ లక్ష్యం నెరవేరిందని స్కాట్ బెసెంట్ చెప్పుకొచ్చారు. యూరప్ దేశాలు భారత్ నుంచి ఆయిల్ కొనుగోలు చేయడంపై ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ఉక్రెయిన్ తో యుద్ధానికి ముందు రష్యా నుంచి భారత్ కేవలం 2 నుంచి 3 శాతమే ఆయిల్ కొనేదని.. కానీ ఇప్పుడు భారీగా పెంచి.. ఆయిల్ ను శుద్ధి చేసి మళ్లీ యూరప్ దేశాలకే భారత్ రిఫైనరీలు అమ్ముతున్నట్టు బెసెంట్ వెల్లడించారు. రష్యాను వ్యతిరేకిస్తున్న యూరప్ దేశాలు భారత్ వద్ద శుద్ధి చేసిన ఆయిల్ ను కొంటే అంతిమంగా రష్యాకే లాభం జరుగుతోందని చెప్పారు బెసెంట్.

స్కాట్ బెసెంట్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే.. అమెరికా త్వరలోనే టారిఫ్‌ లు తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓ వైపు అమెరికా ఆర్థిక సంక్షోభం వైపు వెళ్తోంది. ఇలాంటి సమయంలో డాలర్ తో ట్రేడింగ్ తగ్గడం అంటే అమెరికాకే నష్టంగా మారుతోంది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలడం.. అమెరికాకు ఇతర దేశాల నుంచి వ్యాపార సంబంధాలు తగ్గిపోతుండటం ఈ మధ్య పెరిగిపోతున్నాయి. ఇంకోవైపు భారత్ ఈ టారిఫ్ లపై బెదరకుండా సంయమనం పాటిస్తోంది. రష్యా నుంచి ఆయిల్ కొంటున్న దేశాలపై 500 శాతం టారిఫ్‌ లు విధించే బిల్లును రీసెంట్ గా అమెరికా ప్రతిపాదించింది. కానీ అది ఇంకా ఫైనల్ కాలేదు. ఆ బిల్లు తెస్తామని చెబుతున్నా భారత్ వెనక్కు తగ్గలేదు. భారత ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యం అని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా టారిఫ్ (US Tariffs on India) లు తగ్గిస్తుందా.. లేదా అనేది చూడాలి.

Read Also: అమెరికాను క‌మ్మేసిన మంచు.. 2 వేలకు పైగా విమానాలు ర‌ద్దు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>