కలం, వెబ్‌డెస్క్: యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) పిలుపు మేరకు జనవరి 26 అర్ధరాత్రి నుంచి జనవరి 27 అర్ధరాత్రి వరకు దేశవ్యాప్తంగా బ్యాంకులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ (SBI) తన ఖాతాదారులకు కీలక సూచనలు చేసింది. బ్యాంక్ సమ్మె నేపథ్యంలో ఖాతాదారులు ఇబ్బందులు పడకుండా కొన్ని కీలక సూచనలు చేసింది. ఖాతాదారులు కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్‌బీఐ సూచించింది. నగదు అవసరాల కోసం ఏటీఎంలు, ఏడీడబ్ల్యూఎంలు (ADWMs) వినియోగించుకోవాలని, అలాగే కస్టమర్ సర్వీస్ పాయింట్లు ఉపయోగించుకోవాలని కోరింది.
అదేవిధంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ తదితర డిజిటల్ సేవలను ఎక్కువగా వినియోగించుకోవాలని సూచించింది. సమ్మె కారణంగా కలిగే అసౌకర్యానికి ఖాతాదారులు సహకరించాలని కోరింది. ఖాతాదారులకు కలుగుతున్న ఇబ్బందులకు ఎస్‌బీఐ (SBI) విచారం వ్యక్తం చేసింది.
Read Also: నేను చెప్పినట్లుగానే కేంద్రం చేసింది : కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్
Follow Us On : WhatsApp


