కలం, వెబ్ డెస్క్: నిజామాబాద్ జిల్లాలో గంజాయి ముఠా(Ganja Gang) రెచ్చిపోతోంది. పలువురు యువకులు గంజాయి విక్రయిస్తూ, వినియోగిస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు. దర్జాగా కారులోనే గంజాయి రవాణా చేసి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా వీరిని అడ్డుకోబోయిన ఓ మహిళా కానిస్టేబుల్(Constable)ను ఢీకొట్టి పరారయ్యారు. శుక్రవారం రాత్రి ఎక్సైజ్ సిబ్బంది నిజామాబాద్ (Nizamabad)లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కొందరు యువకులు కారులో గంజాయి తరలిస్తూ అటువైపుగా వచ్చారు. వీరిని అడ్డుకోబోయిన కానిస్టేబుల్ సౌమ్యను ఢీకొట్టి పరారయ్యారు.
ఈ ఘటనలో సౌమ్య తీవ్రంగా గాయపడింది. వెంటనే తోటి సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఎక్సైజ్ సిబ్బంది గంజాయి ముఠా (Nizamabad Ganja Gang) కారును వెంబడించారు. కొద్ది దూరంలో గంజాయి ముఠాను పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇద్దరూ నిర్మల్ జిల్లాకు చెందిన వారిగా పోలీసులు వెల్లడించారు.
Read Also: కేసీఆర్‌తో కేటీఆర్, హరీశ్‌రావు భేటీ..!
Follow Us On: Sharechat


