కలం, వెబ్ డెస్క్ : మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలిసిన విషయమే. అయినా చాలామంది మందు తీసుకోవడం మానలేకపోతారు. రోజు ఆల్కహాల్ తాగితే కాలేయం, కిడ్నీలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. క్రమేణ కాలేయం క్షీణించడం మొదలవుతుంది. ముఖ్యంగా మందు తాగితే శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. దీని వల్ల కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ క్రమంలో మందు తాగేవారికి టాలీవుడ్ నటుడు హర్ష వర్ధన్ కొన్ని సలహాలు (Alcohol Tips) ఇచ్చాడు.
తెలుగు యాక్టర్ హర్ష వర్ధన్ (Harsha Vardhan) ఓ ఇంటర్వ్యూలో పార్టీల సమయంలో మద్యం తాగేటప్పుడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రాక్టికల్ చిట్కాలు చెప్పారు. అలాగే, స్పైసీ ఫుడ్, నాన్-వెజ్ తినేటప్పుడు డీహైడ్రేషన్ రాకుండా ఉండటానికి నీళ్లు తాగడం ఎంత ముఖ్యమో వివరిస్తూ మాట్లాడారు. మద్యం అందరూ తాగుతారు కానీ, కొన్ని టిప్స్ (Alcohol Tips) ద్వారా మద్యం తీసుకోవడం ద్వారా డీ హైడ్రేషన్ కు గురి కాకుండా తగినంత నీళ్లు తాగాలని సూచించారు. మందు పార్టీల్లో ప్రతి పెగ్ తాగిన తరువాత వెంటనే ఒక గ్లాసు నీరు తాగాలన్నారు. ఇది మద్యం వల్ల శరీరంపై పడే ప్రభావాన్ని తగ్గిస్తుందన్నారు.
పార్టీకి వెళ్లే ముందు లేదా డ్రింకింగ్ స్టార్ట్ చేసే ముందు అర లీటర్ నుంచి లీటర్ తాగితే చాలా ఉపయోగకరం అన్నారు. ఈ అలవాటును నటుడు నితిన్ తండ్రి అయిన సుధాకర్ రెడ్డి తనకు నేర్పించాడని చెప్పుకొచ్చారు. శాస్త్రీయంగా చూస్తే మద్యం తీసుకునే సమయంలో నీరు తాగడం వల్ల డీహైడ్రేషన్ కొంత తగ్గుతుంది. కానీ హ్యాంగోవర్‌ను పూర్తిగా అరికట్టదు. అసలు సమస్య ఆల్కహాల్ మెటబాలిజం వల్ల వచ్చే టాక్సిన్స్ కాబట్టి.. మితంగా తాగడమే ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Read Also: చిరంజీవి సినిమాకు బిగ్ షాక్.. రూ. 42 కోట్ల టికెట్ వసూళ్లపై హైకోర్టులో పిటిషన్
Follow Us On : WhatsApp


