కలం, వెబ్ డెస్క్: ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్‌తో (KCR) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) భేటీ అయ్యారు. మూడు రోజుల వ్యవధిలో కేటీఆర్, హరీశ్ రావులపై ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో సిట్ (SIT) విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో ఇద్దరూ కేసీఆర్‌తో భేటీ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ ఇద్దరి విచారణ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఈ భేటీలో కేసీఆర్ మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధం కావాలని కేటీఆర్, హరీశ్ రావులకు దిశానిర్దేశం చేశారు.
ఈ కేసులో మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందని అధికారులు కేటీఆర్, హరీశ్ రావులకు చెప్పారు. కేసీఆర్‌కు (KCR) కూడా సిట్ నోటీసులు పంపించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు విచారణ సందర్భంగా సిట్ ఆయన నియామకంపై కీలక ప్రశ్నలు వేసింది. ఈ సందర్భంగా ప్రభాకర్ రావు ఆ విషయం కేసీఆర్‌నే అడగాలని సమాధానమిచ్చారు. దీంతో కేసీఆర్‌ను కూడా విచారణ చేయనున్నారనే ఊహాగానాలు పెరుగుతున్నాయి.
Read Also: నెక్స్ట్ నోటీస్ ఎవరికి?.. కేసీఆర్‌కా?.. కవితకా?
Follow Us On : WhatsApp


