epaper
Tuesday, January 27, 2026
spot_img
epaper

వచ్చే ఎన్నికల్లో పోటీపై కోమటిరెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

కలం, నల్లగొండ బ్యూరో: వచ్చే ఎన్నికల్లో ఇంట్రెస్ట్ ఉంటే మళ్లీ పోటీ చేస్తానని, లేకుంటే కోమటిరెడ్డి ప్రతీక్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటూ ప్రతి పిల్లాడిని తన కొడుకులాగా భావిస్తానని మంత్రి కోమటిరెడ్డి (Komatireddy) వెంకటరెడ్డి తెలిపారు. మంగళవారం ఓ సమావేశానికి హాజరైన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి ఉన్నా లేకున్నా తన సేవ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. తాను అడిగితే నల్లగొండకు కేంద్ర ప్రభుత్వం (Central Govt) నిధులు ఇవ్వడానికి రెడీగా ఉందని తెలిపారు.

అధికారులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తేనే విద్యా వ్యవస్థ మెరుగుపడుతుందని, ఇప్పటికీ ఇంజనీరింగ్ విద్యార్థులు ఇంగ్లీష్ రాక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉద్యోగాలకు ఎంపికైనా ఇంగ్లీష్‌ రాకపోవడంతో రిజెక్ట్ అవుతున్నారని, ఫ్యూచర్ సిటీలో ఇంగ్లీషుకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>