కలం, సినిమా : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటించిన లేటెస్ట్ మూవీ “ఉస్తాద్ భగత్ సింగ్” (Ustaad Bhagat Singh). స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. క్యూట్ బ్యూటీస్ శ్రీలీల, రాశి ఖన్నా పవన్ సరసన హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ఇటీవల ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వరుస అప్డేట్స్ రానున్నాయి అంటూ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ఉస్తాద్ భగత్ సింగ్ డబ్బింగ్ ప్రారంభమైంది. మన కల్ట్ కెప్టెన్ హరీశ్ శంకర్ రాసిన పవర్ఫుల్ డైలాగ్స్ కోసం సిద్దంగా ఉండండి.. పవన్ కల్యాణ్ స్వాగ్, మాస్ ఎనర్జీతో ఈ సినిమా (Ustaad Bhagat Singh) సిద్దం అవుతుంది. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటించించనున్నట్లు తెలిపారు.
Read Also: రాష్ట్రపతి భవన్ ఎట్ హోమ్‌లో మెరిసిన సమంత, ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్
Follow Us On: X(Twitter)

