తండ్రి కాబోతున్న టీమిండియా కెప్టెన్​..

కలం, స్పోర్ట్స్​ : టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఇప్పుడు ఆకాశంలో తేలిపోతున్నారు. అటు కెప్టెన్‌గా ప్రపంచకప్‌ను ముద్దాడిన సంతోషం, ఇటు త్వరలో తండ్రి కాబోతున్నానన్న వార్త ఆయన ఇంట రెట్టింపు ఉత్సాహాన్ని నింపాయి. సూర్య భార్య దేవిషా శెట్టి త్వరలో తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.

శనివారం (మార్చి 14) ముంబైలో జరిగిన దేవిషా (Devisha Shetty) సీమంతం వేడుక ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. సూర్య, దేవిషాలది దశాబ్ద కాలానికి పైబడిన అనుబంధం. 2010లో ముంబైలోని కాలేజీలో కలిసిన ఈ ఇద్దరూ, ఆరేళ్ల పాటు ప్రేమలో ఉండి 2016 జూలై 7న మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. భరతనాట్యం డ్యాన్సర్ అయిన దేవిషా, సూర్య ప్రతి గెలుపులోనూ వెన్నంటి నిలుస్తూ వచ్చారు. దాదాపు పదేళ్ల నిరీక్షణ తర్వాత ఈ దంపతులు తమ వారసుడి కోసం ఆరాటపడుతున్నారు.

సీమంతం వేడుకలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఈ దంపతులు ఎంతో ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా నెటిజన్లు “సూర్యకు ఇప్పుడు రెండు కప్పులు (వరల్డ్ కప్ & త్వరలో వచ్చే చిన్నారి) దక్కాయి” అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. అటు మైదానంలో కెప్టెన్‌గా, ఇటు నిజజీవితంలో తండ్రిగా సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఒకేసారి కొత్త బాధ్యతలు చేపట్టబోతుండటం విశేషం.

 Read Also: వైర‌ముత్తుకు విషెస్‌.. క‌మ‌ల్, ర‌జినీల‌పై చిన్మ‌యి ఫైర్‌

Follow Us On: Sharechat

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>