కలం, వెబ్ డెస్క్: ప్రముఖ తమిళ కవి, సినీ గేయ రచయిత ‘కవి పేరరసు’ వైరముత్తు (Vairamuthu) ప్రతిష్ఠాత్మక జ్ఞానపీఠ్ పురస్కారానికి (Jnanpith Award) ఎంపికైన సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. తమిళ సాహిత్యంలో వైరముత్తుకు ఒక ప్రత్యేక స్థానం ఉందని, కేవలం సినీ గీత రచయితగానే కాకుండా కవిగా, నవలా రచయితగా ఆయన చేసిన సేవలు ఎంతో ప్రశంసనీయమని పవన్ కొనియాడారు. వైరముత్తు రచనల్లో కనిపించే సామాజిక స్పృహ, మానవ సంబంధాల్లోని సున్నితత్వం పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటాయని ఆయన పేర్కొన్నారు.
సినీ గీత రచయితగా ఏడు సార్లు జాతీయ పురస్కారాలను అందుకున్న ఘనత వైరముత్తు సొంతమని, ఇప్పుడు జ్ఞానపీఠ్ పురస్కారంతో ఆయన సాహితీ ప్రస్థానానికి అత్యున్నత గౌరవం దక్కిందని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం అధికారిక ఎక్స్ ఖాతా వేదికగా ఓ పోస్ట్‌ను షేర్ చేస్తూ వైరముత్తుకు అభినందనలు తెలిపింది.
Read Also: తండ్రి కాబోతున్న టీమిండియా కెప్టెన్..
Follow Us On: X(Twitter)

