కలం, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లా (Annamayya District) పుంగనూరులో విషాదం చోటు చేసుకుంది. ఒక్క చిన్న తప్పుతో ఒకే కుటుంబంలో నలుగురు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే… మురళి అనే వ్యక్తి పుంగనూరులోని త్యాగరజు వీధిలో కుటుంబంతో ఉంటున్నాడు. ఇటీవల తన బైక్ పాడవడంతో మురళి ఓ మెకానిక్‌కు చూపించాడు. బైక్‌ను బోర్ చేయించగా రాత్రంతా స్టార్ట్‌లో ఉంచాలని మెకానిక్ మురళికి సూచించాడు. దీంతో మురళి బైక్‌ను ఇంట్లోనే పెట్టి తలుపులు వేసి రాత్రంతా స్టార్ట్‌లో ఉంచాడు. తలుపులు మూసి ఉండటంతో బైక్ నుంచి వచ్చిన కార్బన్ మోనాక్సైడ్ (Carbon Monoxide) పొగ బయటకు వెళ్లే దారి లేకుండా పోయింది. కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఇంట్లో నిద్రిస్తున్న ముగ్గురు చిన్నారులు, మురళి తండ్రి మృతి చెందారు. మురళి, తన భార్య రేవతి ఇంటిపై గదిలో నిద్రపోవడంతో వారికి ప్రాణాపాయం తప్పింది. చిన్న పొరపాటుతో చిన్నారులతో సహా నలుగురు మృతి చెందడంతో స్థానికంగా విషాదం నెలకొంది.
Read Also: టార్గెట్ ఒకరు.. బలైంది మరొకరు : నార్సింగిలో విషాదం
Follow Us On : WhatsApp

