కలం, వెబ్ డెస్క్: నాంపల్లి(Nampally)లోని బట్చాస్ ఫర్నీచర్ షాప్‌లో జరిగిన అగ్ని ప్రమాదం (Fire Accident) తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. శనివారం మధ్యాహ్నం నుంచి రక్షణ చర్యలు చేపట్టిన రెస్క్యూ టీం 22 గంటల తర్వాత భనం సెల్లార్‌లోకి చేరుకోగలిగారు. సెల్లార్‌లో బేబీ(45), ప్రణీత్(8) అఖిల్(11), ఇంతియాజ్(28), హబీబ్(32)ల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను గుర్తుపట్టలేనంత దారుణంగా కాలిపోయాయి. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో మృతుల కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.
Read Also: అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకుంటాం : మంత్రి పొన్నం
Follow Us On: X(Twitter)


