కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) సందడి నెలకొంది. రేపో మాపో నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే కార్యాచరణ ప్రకటించి విస్తృత పర్యటనలకు శ్రీకారం చుట్టాయి. సంక్షేమ పథకాలే అస్త్రంగా కాంగ్రెస్, ప్రభుత్వ వ్యతిరేకతపై బీఆర్ఎస్, మోడీ అభివృద్ది ఎజెండాతో బీజేపీ పార్టీలు జనాల్లోకి వెళ్తున్నాయి. అయితే ఇతర పార్టీల కంటే కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తూ ప్రచారం పర్వంలోకి దిగింది. ఈ నేపథ్యంలో గురువారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు బహిరంగ సవాల్ విసిరారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 10శాతం సీట్లు BRS గెలిస్తే నేను దేనికైనా సిద్ధమని తేల్చి చెప్పారు. రెండు సిట్టింగ్ స్థానాల్లో ఉపఎన్నికలు జరిగితే ఒకదానిలో కూడా బీఆర్ఎస్ గెలవలేదన్నారు. రెండేళ్లలో సీఎం అవుతానంటే నవ్వు వస్తుందని కేటీఆర్ (KTR)పై మంత్రి కోమటిరెడ్డి సెటైర్లు వేశారు.


