కలం, వెబ్ డెస్క్: అమెరికా(USA)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ భారత సంతతి వ్యక్తి తన భార్యతో పాటు ముగ్గురు బంధువులను చంపేశాడు. జార్జియా(Georgia)లోని లారెస్ విల్లేలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా నివసిస్తున్న భారత సంతతి వ్యక్తి విజయ్ కుమార్ భార్య మీమూ డోగ్రాతో గొడవ పడ్డాడు. మాటామాటా పెరగడంతో భార్య మీమూ డోగ్రాతో పాటు, బంధువులు గౌరవ్ కుమార్, నిధి, హరీష్ చందర్‌లను విజయ్ కాల్చి చంపేశాడు.
అనంతరం విజయ్ ఇంటి వెనుక ఉన్న అడవిలోకి పారిపోయాడు. ఈ విషయాన్ని ఓ 12 ఏళ్ల చిన్నారి పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోలీసులు వచ్చే వరకు సమాచారం అందించిన చిన్నారితో పాటు మరో ఇద్దరు పిల్లలు అల్మారాలో దాక్కొని ఉన్నారు. పోలీసులు అడవిలో ముమ్మరంగా గాలించి విజయ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు.
Read Also: సోమాలియా డిప్యూటీ పీఎం హిందీ స్పీచ్… అంతా ఫిదా
Follow Us On: Instagram


