epaper
Saturday, January 24, 2026
spot_img
epaper

సోమాలియా డిప్యూటీ పీఎం హిందీ స్పీచ్… అంతా ఫిదా

కలం, తెలంగాణ బ్యూరో : దావోస్ వేదికగా సోమాలియా డిప్యూటీ ప్రధాని (Somalia Deputy PM) సలా అహ్మద్ జమా హిందీలో ఇచ్చిన ఇంటర్‌వ్యూ హాట్ టాపిక్‌గా మారింది. ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఇది ట్రెండింగ్ ఇష్యూగా మారింది. ఆఫ్రికా ఖండంలో తీరప్రాంతంగా ఉన్న సోమాలియా దేశ డిప్యూటీ ప్రధాని హిందీలో మాట్లాడడం ఇండియా టుడే జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. స్పష్టమైన హిందీ భాషలో మాట్లాడుతున్న అహ్మద్ జమాను చూసి ముచ్చటపడిన రాజ్‌దీప్… ఆయన పూర్వాశ్రమం గురించి ఆరా తీశారు. పూణె సహా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో చిన్నతనంలో గడిపిన అనుభవాలు హైదరాబాద్ మీదుగా ఢిల్లీ వరకు సాగిందని, అందుకే తనకు హిందీ స్పష్టంగా వచ్చని, హిందీలోనే మాట్లాడానని వివరణ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ కొంతకాలం ఉన్నానని గుర్తు చేసిన ఆయన ఇప్పుడు తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడిందన్న అంశాన్నీ వెల్లడించారు.

హిందీ వ్యతిరేకులకు చెంప పెట్టులా :

స్వచ్ఛమైన హిందీలో టీవీ ఛానెల్‌కు ఇంటర్‌వ్యూ ఇవ్వడాన్ని కొద్దిమంది ట్విట్టర్ వేదికగానే స్పందించారు. దక్షిణ భారత్‌లో చాలా మంది హిందీ వ్యతిరేక ఉద్యమం నడుపుతున్నారని, కానీ వేరే ఖండంలోని ఒక చిన్న దేశ డిప్యూటీ ప్రధాని (Somalia Deputy PM) హిందీలో మాట్లాడడానికి ఆసక్తి చూపడాన్ని ఆదర్శంగా తీసుకోవాలని హితవు పలికారు. చాలా మంది ఎంపీలకు హిందీ వచ్చినా పార్లమెంటులో ఇంగ్లీషులోనే మాట్లాడే పరిస్థితుల్లో సోమాలియా డిప్యూటీ పీఎం హిందీలోనే మాట్లాడడం సరికొత్త చర్చకు దారితీసినట్లయింది. సోమాలీ భాషతో పాటు ఆంగ్లంలో మంచి ప్రావీణ్యం ఉన్నా హిందీలో మాట్లాడడానికి ఆసక్తి చూపడం విశేషం. భారత్‌లో ఉంటున్న చాలా మంది ఇంగ్లీషులో మాట్లాడడం ఒక స్టేటస్ అని భావిస్తున్న తరుణంలో సోమాలియా డిప్యూటీ పీఎం ఆంగ్లానికి బదులు హిందీలో ఇంటర్‌వ్యూ ఇవ్వడం రాజ్‌దీప్ సర్దేశాయికి మాత్రమే కాక నెటిజెన్లను కూడా ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ఇండియన్ కల్చర్‌తో అనుబంధం :

హైదరాబాద్‌ సహా పలు ఇండియన్ సిటీస్‌లో గడిపిన తనకు ఇష్టమైన ప్రదేశం కూడా అని అహ్మద్ జమా (Salah Ahmed Jama) సంతోషంగా చెప్పుకున్నారు. ఇండియన్ కల్చర్ తనకు ఎంతగానే నచ్చిందన్నారు. ఎన్నో తరాల నుంచి భారత్, సోమాలియా మధ్య సంబంధాలు ఉన్నాయని, రెండు దేశాల మధ్య సముద్రమే వారధి అని, అందుకే ఈ రెండూ పొరుగు దేశాలే అని గర్వంగా చెప్పుకున్నారు. భారత్‌లో ఉన్నప్పుడు తనకు ఇష్టమైన ఫుడ్ ‘దాల్ మఖని’ అని, బటర్ రోటీతో కలుపుకుని తినేవాడినని పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. సోమాలియా దేశం సముద్రపు దొంగలకు, డ్రగ్స్ రవాణాకు ప్రసిద్ధి అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించి దాడి చేయక తప్పదనే హెచ్చరికకు కూడా అహ్మద్ జమా ఘాటుగా స్పందించారు. సోమాలియా ప్రజలు చాలా తెలివైనవారని, అమెరికా సహా చాలా దేశాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.

Read Also: త్వరలో మార్కెట్​లోకి టెస్లా రోబోలు : మస్క్​

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>