epaper
Tuesday, January 20, 2026
spot_img
epaper

పసుపు పాలు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే

కలం, వెబ్ డెస్క్: పసుపు పాలతో (Turmeric Milk) ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. ఇది అనేక వ్యాధులను నయం చేస్తుంది. అందుకే మనపెద్దవారు పసుపు పాలను ఆరోగ్య నిధిగా పిలుస్తారు. ఒక కప్పు వెచ్చని పసుపు పాలతో జలుబు, దగ్గు, శరీర నొప్పి, అలసట, లేదా సరిగ్గా నిద్రపోకపోవడం లాంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు. 2022లో నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌ అధ్యయనం ప్రకారం.. పసుపులో ప్రధానంగా కర్కుమిన్ ఉంటుంది.

ఇందులో ఇనుము, మాంగనీస్, పొటాషియం, ఫైబర్, విటమిన్ సి, విటమిన్ బి6 కూడా ఉంటాయి. ఈ పోషకాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, శరీరంలో మంటను తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే ఎముకలు (Bones), కండరాలు, నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. కీళ్ల నొప్పులు, కండరాల కోలుకోవడానికి సహాయపడతాయి. అలాగే జీర్ణక్రియ పనితీరుకు బాగా పనిచేస్తుంది. పసుపు పాలలో దాల్చిన చెక్క, అల్లం లేదా నల్ల మిరియాలు తీసుకోవడం మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చని నిపుణులు చెప్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>