కలం, వెబ్ డెస్క్: ‘నడక (Walking) అంటే కేవలం రోజూ చెయ్యాల్సిన వ్యాయామం కాదు.. అది మీ జీవిత కాలాన్ని పొడిగించే సులభమైన ట్రిక్ కూడా’ అని అంటున్నారు డాక్టర్ సౌరభ్ సేథి. ‘నడకతో దీర్ఘకాలిక ప్రయోజనాలున్నాయి. రోజూ కొంతదూరం నడవడం వల్ల మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. స్ట్రోక్, డిమెన్షియా, క్యాన్సర్ వంటి సమస్యల రిస్క్ తగ్గించవచ్చు. అలాగే జీవితాన్ని పొడిగించవచ్చు’ అని ఆమె వివరించారు.
ఇటీవల చేసిన ఒక అధ్యయనంలో 80,000 మందిని 7 సంవత్సరాలు యాక్టివిటీ మానిటర్‌తో ట్రాక్ చేశారు. అందులో నడక (Walking) వల్ల కలిగే ప్రయోజనాలు స్పష్టంగా తెలిశాయి. రోజుకు 7,000–10,000 అడుగులు నడిచిన వారికి ఎక్కువ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ, తక్కువ గుండె జబ్బులు, క్యాన్సర్, మానసిక సమస్యలు వచ్చాయని తేలింది. మరో స్టడీలో రోజూ వేసే ప్రతీ అదనపు 2,000 అడుగులు మరణించే రిస్క్‌ను సుమారు 10శాతం తగ్గిస్తుందని తేల్చింది.
ఫాస్ట్ పేస్ కూడా చాలా ముఖ్యమని డాక్టర్ సేతి చెప్పారు. “మొబైల్ లో కాల్ చేస్తున్నప్పుడు నడవడం, మ్యూజిక్ లేదా పాడ్‌క్యాస్ట్‌ల వినడం ఇవన్నీ కౌంటవుతాయి. ఇంకా బెటర్ చేయాలంటే మూడు నిమిషాలు ఫాస్ట్, మూడు నిమిషాలు స్లో –ఇంటర్వెల్ వాకింగ్. కాస్త ట్రై చేయండి, చాల ఫన్” అని అన్నారు.
జైపూర్‌లోని సీకే బిర్లా హాస్పిటల్స్‌లో పనిచేసే డాక్టర్ రాహుల్ మతూర్ కూడా నడక చాలా మంచిదని చెప్తున్నారు. “సింపుల్ కాని సూపర్ పవర్‌ఫుల్ వ్యాయామం నడక” అని చెబుతున్నారు. “మన పెద్దలు చెప్పినది నిజం. ప్రతి రోజు బ్రిస్క్ వాక్ చేయడం జీవితాన్ని పొడిగిస్తుంది, శరీరం, మైండ్, హార్ట్ అన్నీ బాగా ఫంక్షన్ అవుతాయి” అని వివరించారు.
నడక శక్తి అనేది పలు బాడీ సిస్టమ్స్ మీద క్రమంగా ప్రభావం చూపడం. రక్తపోటు తగ్గడం, షుగర్ కంట్రోల్, హానికర ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గడం, ఎముక బలపడటం, మూడ్ బూస్ట్ ఇవన్నీ ఒక్కసారే జరుగుతాయి. మధ్యవయస్కులు, వృద్ధులు రోజు నడక చేస్తే హార్ట్ డిసీజ్, స్ట్రోక్, టైప్-2 డయాబెటిస్, జాయింట్ స్టిఫ్‌నెస్, డిమెన్షియా, డిప్రెషన్ రిస్క్ 30–50 శాతం తగ్గుతుంది. నడక సులభం, సేఫ్, అందరికీ అందుబాటులో ఉంటుంది. ఎటువంటి స్పెషల్ స్కిల్స్, పరికరాలు, ఖర్చు అవసరం లేదని నిపుణులు చెప్తున్నారు.
బ్రెయిన్ హెల్త్ కోసం కూడా నడక తప్పనిసరి. బ్రిస్క్ వాక్ హిప్పోకాంపస్‌కు రక్తం పెంచుతుంది, మెమొరీ పవర్‌కి బెస్ట్. వృద్ధులు రోజూ నడక చేస్తే బ్యాలెన్స్, కండరాల శక్తి, నిద్ర మెరుగుపడతాయి. ఉదాహరణకు, 60 ఏళ్ల మామయ్య రోజూ 30 నిమిషాల సాయంత్రం వాక్ చేస్తే, నిద్ర మెరుగై, స్ట్రెస్ తగ్గి, రక్తపోటు కంట్రోల్ అవుతుంది. అంతే కాక, 50 ఏళ్ల వ్యక్తి భోజనం తర్వాత చిన్న వాక్ చేయడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది.
తేలికపాటి నడకతో ఎంతో ఆరోగ్యం
నడక అలవాట్లను అలవాటు చేసుకోవడం చాలా సులభం. 20–30 నిమిషాల బ్రిస్క్ వాక్ లేదా 10 నిమిషాల మూడు సెషన్స్, మెట్లు ఎక్కడం, ఫోన్ కాల్స్ మాట్లాడుతూ నడవడం, భోజనాల తర్వాత చిన్నపాటి నడక అన్నీ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. దాంతో పాటుగా ఆఫీసుల్లో కూడా వాకింగ్ మీటింగ్స్ అనే ప్రక్రియను అవలంబిస్తే ప్రొడక్టివిటీతో పాటు ఆరోగ్యం కూడా ఇంప్రూవ్ అవుతుంది.
నడక ఓ ఔషదం
నడక అనేది చాలా అండర్‌రేటెడ్ ఔషదమని డాక్టర్ మతూర్ అంటుున్నారు. ఇది మన శరీరంపై అధిక భారం మోపదని, గుండెను బలపరుస్తుందని, మెదడుకు శాంతినిస్తుందని చెప్తుున్నారు. అంతేకాకుండా నడక దీర్ఘకాలిక ఔషధంలా పనిచేస్తుందని వివరిస్తున్నారు. కూర్చోవడం తగ్గించి, నడవడం పెంచాలని, రోజుకు ఇంటర్వెల్ వాకింగ్, సాయంత్రం పూట సరదా నడక ఇలా అన్నీ కలుపుకుని 7,000–10,000 అడుగులు వేయడం ద్వారా ఆయుషు, క్వాలిటీ ఆఫ్ లైఫ్, మానసిక ప్రశాంతత పెరుగుతాయని వైద్యులు చెప్తున్నారు.


