కలం, వెబ్ డెస్క్ : తల్లిదండ్రులను, తోబుట్టువులను ఎంపిక చేసుకోలేము.. కానీ, మిత్రులను మాత్రం ఎంచుకునే అవకాశం ఉంది. ఎవరికీ చెప్పుకోలేని బాధలు, సంతోషాలు, రహస్యాలను కేవలం స్నేహితులతో మాత్రమే పంచుకోగలం. కష్టం, నష్టం.. సంతోషం, బాధ పంచుకోవడానికి స్నేహితులు ఎంతో అవసరం. ఎల్లప్పుడు మన వెంటే ఉంటూ ప్రోత్సహించే నిజమైన ఫ్రెండ్స్ (True Friendship) ఉండడానికి పెట్టిపుట్టాలి.
True Friendship | ‘ఒక మంచి స్నేహితుడు.. వంద పుస్తకాలతో సమానం’ అనే సూక్తి మనకు తెలిసిందే. దీనికి తగ్గట్టుగా నిజమైన స్నేహానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు కొందరు. ఓ బాలిక కు క్యాన్సర్ సోకింది. కీమో థెరపీ తీసుకోవడం వల్ల జుట్టు మొత్తం రాలిపోయి గుండుగా మారడంతో స్కూల్ కు వెళ్లడానికి బాధపడుతూ ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు బాలికకు అండగా నిలిచారు. మానసికంగా బలం ఇవ్వడానికి.. నీకు మేమున్నాం అని చెబుతూ గుండు చేయించుకున్నారు. ఆ చిన్నారిలో ధైర్యం నింపేందుకు చేసిన మంచి పనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral) గా మారింది. ఇది చూసిన నెటిజన్ల హృదయం కదిలిపోయింది. ఇది కదా నిజమైన ఫ్రెండ్‌షిప్ అంటూ సలాం చేస్తున్నారు.
View this post on Instagram


