కలం, వెబ్ డెస్క్: ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి వార్నింగ్(Trump Warns) ఇచ్చారు. ఆ దేశం బేషరతుగా లొంగిపోవాల్సిందేనన్నారు. ఎలాంటి చర్చలకూ అవకాశం లేదన్నారు. సరెండర్ మినహా మరే ఒప్పందం కుదరదన్నారు. ఈ మేరకు శుక్రవారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో ట్రంప్ పోస్ట్ చేశారు.
ఇరాన్‌కు ఇక అవకాశం లేదని, లొంగిపోవాల్సిందేనని తేల్చి చెప్పారు. ఆ తర్వాత ఇరాన్ అభివృద్ధి కోసం ఆలోచిస్తామన్నారు. ఆ దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇరాన్‌కు మంచి భవిష్యత్తు ఇస్తామని, ఆర్థికంగా మెరుగైన, మరింత బలమైన స్థితికి తీసుకొస్తామని చెప్పారు(Trump Warns). మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ మాత్రం అమెరికాతో సంధికి చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు. ఆ దిశగా కొన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిపారు. అయితే, వాటి వివరాలు ఆయన బయటపెట్టలేదు.
తెహ్రాన్, బాగ్దాద్‌లో బాంబుల వర్షం..
పశ్చిమాసియా యుద్ధం ఏడోరోజూ ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఇరాన్ రాజధాని బాగ్దాద్, మరో రెండు ప్రధాన నగరాలు ఇస్ఫహాన్, మషాద్లతోపాటు లెబనాన్ రాజధాని బీరుట్‌పై బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్.. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్, జెరూసలేంపై క్లస్టర్ బాంబులు వదిలింది. అలాగే ఖతార్, యూఏఈ పైనా డ్రోన్లు, మిసైళ్లతో ఇరాన్ దాడికి దిగింది. ఈ యుద్ధం కారణంగా ఇప్పటివరకు ఇరాన్లో 1200 మందికి పైగా మరణించినట్లు అంతర్జాతీయ వార్తా కథనాలు వెల్లడిస్తున్నాయి.

