అల్లు శిరీష్ వివాహానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

కలం, సినిమా : అల్లు శిరీష్(Allu Sirish), నయనిక( Nayanika)ల వివాహం నేడు ఎంతో ఘనంగా జరుగుతుంది. ఇటీవల ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్‌కు రాజకీయ , సినీ ప్రముఖులు హాజరైన నేపధ్యంలో.. పెళ్లి బంధుమిత్రులు, అత్యంత సన్నిహితుల మధ్య జరుగుతుంది. రిసెప్షన్ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) అందుబాటులో లేకపోవడంతో హాజరుకాలేకపోయారు. తాజాగా వివాహానికి హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి(Komatireddy Venkat Reddy) కూడా హాజరయి నూతన వధూవరులను ఆశీర్వదించారు. నూతన వధూవరులు, అల్లు అర్జున్, అల్లు అరవింద్, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట రెడ్డి కలిసి దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>