Mobile Popup Ad
Mobile Popup Ad

భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు

కలం, ఖమ్మం బ్యూరో: భార్యను హత్య చేసిన కేసులో భర్తకు జైలు శిక్ష విధిస్తూ భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ శుక్రవారం తీర్పు వెల్లడించారు. ప్రాసిక్యూషన్ వివరాల ప్రకారం.. చుంచుపల్లి మండలం విద్యానగర్‌కు చెందిన లకావత్ సైదులు పెద్ద కూతురు స్నేహను, గార్ల మండలం, పుల్లూరుకు చెందిన భూక్యా శ్రీధర్‌కు ఇచ్చి 2021 జూలై 30న పెళ్లి జరిపించారు.

భర్త, అత్త మామల వేధింపులు భరించలేక స్నేహ కొంత కాలంగా పుట్టింట్లో ఉంటోంది. 2023 మే 20న స్నేహ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో భర్త భూక్యా శ్రీధర్‌ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించినప్పటికీ ఆమె చనిపోయింది. కూతురి మృతికి కారణమైన భర్త, అత్త, మామలపై చుంచుపల్లి పోలీసుల (Police)కు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు విషయమై కోర్టు 17 మంది సాక్షులను విచారించిన అనంతరం భూక్యా శ్రీధర్ పై నేరం రుజువుకావడంతో జీవిత ఖైదు, వేయి రూపాయలు జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>