Mobile Popup Ad
Mobile Popup Ad

సీఎస్, డీజీపీ అవకాశాలు వారికేనా?.. సెక్రటేరియట్‌లో డిస్కషన్

కలం, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పదవీకాలం ఈ నెల చివరితో ముగియనున్నది. డీజీపీ శివధర్‌రెడ్డి వచ్చే నెల చివర్లో రిటైర్ కానున్నారు. వీరిద్దరి స్థానంలో కొత్తగా వచ్చేదెవరనే చర్చ చాలాకాలంగా ఉన్నా ప్రంట్ రన్నర్‌ ఎవరనేది సెక్రటేరియట్ స్టాఫ్‌లో ఒక అంచనా వచ్చింది. ప్రధాన కార్యదర్శిగా వికాస్ రాజ్, డీజీపీగా మహిళా ఐపీఎస్ ఖాయమనేది వారి మాటల్లో వ్యక్తమవుతున్నది. ఇప్పటికే సీఎస్ ఎక్స్ టెన్షన్‌లో ఉన్నందున మరోసారి అవకాశం ఉండదనుకుంటున్నారు. ఇక ఫుల్ టైమ్ డీజీపీ విషయంలో రిటైర్‌మెంట్‌కు దగ్గర్లో ఉన్నందున యూపీఎస్సీ నిబంధన ప్రకారం శివధర్‌రెడ్డి కొనసాగే అవకాశం లేదని నమ్ముతున్నారు. దీంతో కొత్త చీఫ్ సెక్రటరీగా వికాస్‌రాజ్, డీజీపీగా మహిళా ఐపీఎస్ (పరోక్షంగా శిఖా గోయల్ పేరును ప్రస్తావిస్తూ) ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి.

జయేశ్‌రంజన్ ఎంపికపై ఆసక్తికర వాదన :

సీనియారిటీ ప్రకారం జయేశ్ రంజన్‌కు చీఫ్ సెక్రటరీ అయ్యే అవకాశమున్నా ఆయనకు చాన్స్ దక్కకపోవచ్చన్నది సెక్రటేరియట్ ఉద్యోగుల అభిప్రాయం. ఆ బాధ్యతలు చేపట్టడానికి ఆయన సుముఖంగా లేకపోవడంతో పాటు ప్రభుత్వం సైతం భిన్నంగా ఆలోచిస్తున్నదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అర్హులైన ఆఫీసర్ల జాబితాలో ఆయన పేరు ఉన్నప్పటికీ ప్రభుత్వ ప్రాధాన్యాలు, ఆయన ఆసక్తి కూడా ముఖ్యమని, రెండువైపులా ప్రతికూల పరిస్థితులే ఉన్నాయని సూచనప్రాయంగా వెల్లడైంది. వికాస్‌రాజ్‌, జయేశ్‌రంజన్‌తో పాటు ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న సంజయ్ జాజు, సబ్యసాచి ఘోష్, అరవింద్ కుమార్ తదితరుల పేర్లు ఉన్నప్పటికీ ఒక్కొక్కరికి ఒక్కో రకమైన పాజిటివ్, నెగెటివ్ అంశాలను ఉదహరిస్తూ అంచనా వేస్తున్నారు. రిటైర్ కానున్న రామకృష్ణారావుకు ప్రభుత్వం తరఫున మరో అవకాశం లభిస్తుందని సమాచారం.

ఫస్ట్ టైమ్ మహిళకు డీజీపీ అవకాశం :

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోగానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాతగానీ డీజీపీగా మహిళా ఐపీఎస్‌కు అవకాశం రాలేదు. ఈసారి అలాంటి అవకాశం వస్తుందని, తెలంగాణ చరిత్రలో కొత్త రికార్డు సాకారమవుతుందన్న అభిప్రాయం పోలీసు వర్గాల్లో వ్యక్తమవుతున్నది. ఫుల్ టైమ్ డీజీపీ కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన నలుగురు అధికారుల పేర్లతో జాబితా పంపినా అందులో మూడింటిని యూపీఎస్సీ ఫైనల్ చేయనున్నది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తన విచక్షణ మేరకు ఒకరిని ఖరారు చేస్తుంది. ఆ నలుగురిలో సీవీ ఆనంద్ (1991 బ్యాచ్) సీనియర్ ఆఫీసర్. ప్రస్తుతం సెంట్రల్ ఐబీలో ఉన్న వినాయక్ ప్రభాకర్ ఆప్టే, శిఖాగోయల్, సౌమ్యా మిశ్రా 1994 బ్యాచ్‌కు చెందినవారు. ఆ అధికారుల రిటైర్‌మెంట్ తేదీలు, రానున్న రోజుల్లో జరిగే ‘సర్’ ప్రక్రియ, అసెంబ్లీ ఎన్నికలు తదితరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం తన ప్రాధాన్యత మేరకు ఎవరిని నియమిస్తుందనే ఆసక్తికరం.

Read Also: SIRతో ప్రక్షాళన.. తెలంగాణలో 50 లక్షల ఓటర్లు డౌటే!!

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>