కోళ్ల ఫారంలో బియ్యం నిల్వలు సీజ్

కలం, ఖమ్మం బ్యూరో : కోళ్ల ఫారంలో నిల్వ చేసిన బియ్యాన్ని జూలూరుపాడు(Julurupadu) పోలీసులు శుక్రవారం సీజ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem district) జిల్లాలోని జూలూరుపాడు మండలం మాచినేని పేట గ్రామానికి చెందిన జీ.నరసింహ రావు, కొమ్మినేని నాగేశ్వర రావులు ప్రజల వద్ద నుంచి రేషన్ బియ్యాన్ని తక్కువ రేటుకు కొనుగోలు చేసి మాచినేని పేట గ్రామ శివారులో గల కోళ్ల ఫారంలో అక్రమంగా నిల్వ చేశారు. ఈ బియ్యాన్ని అధిక రేటుకు అమ్ముతూ ప్రజలను మోసం చేస్తుండటంతో, సమాచారం అందుకున్న జూలూరుపాడు సీఐ శ్రీ లక్ష్మి కోళ్ల ఫారంపై దాడి చేసి 23 క్వింటాళ్ల రేషన్ బియ్యంతో పాటు బజాజ్ ప్లాటినం బైక్, సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యాన్ని, సీజ్ చేసిన వస్తువులను స్టేషన్‌కు తరలించి, ఇద్దరిపై కేసు నమోదు చేశామని పోలీసులు వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>