Mobile Popup Ad
Mobile Popup Ad

తండ్రి ఎస్ఐ.. కొడుకు ఐపీఎస్

కలం, వరంగల్ బ్యూరో: హన్మకొండ (Hanamkonda) జిల్లా న్యూ శాయంపేట‌కు చెందిన గుండు అఖిలేశ్ యూపీఎస్సీ 2025 ఫలితాల్లో 464 ర్యాంక్ సాధించి ఐపీఎస్‌గా ఎంపికయ్యాడు. అఖిలేశ్ తండ్రి శివకుమార్ కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరి పదోన్నతిపై భూపాలపల్లి జిల్లాలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. శివకుమార్, సరస్వతి దంపతుల కుమారుడు అఖిలేశ్ ఐపీఎస్ ( IPS) ఎంపిక కావడం పట్ల కుటుంబసభ్యులు, మిత్రులు, బంధువులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకే కుటంబం నుంచి తండ్రి, కొడుకు ప్రభుత్వ కొలువులు సాధించడంతో పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>