కలం, వెబ్ డెస్క్: నాంపల్లి (Nampally) అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారికి మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రమాద ఘటనను సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) దృష్టికి తీసుకెళ్లామని, బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని పేర్కొన్నారు. ఫైర్ సేఫ్టీకి సంబంధించి నిబంధనలు పాటించకుండా ఘటనకు బాధ్యుడైన షాపు యజమానిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జీహెచ్ఎంసీ, పోలీస్, రెవెన్యూ, హైడ్రా అధికారులు సమన్వయం చేసుకొని చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం (Ponnam Prabhakar) సూచించారు. నాంపల్లిలోని బట్చాస్ ఫర్నీచర్ దుకాణంలో శనివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు 22 గంటల పాటు శ్రమించి రెస్క్యూ టీం భవనంలో చిక్కుకుపోయిన ఐదుగురి మృతదేహాలను వెలికితీసింది. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
Read Also: వరంగల్ కలెక్టర్ సత్యశారదకు రాష్ట్రస్థాయి అవార్డు
Follow Us On: Sharechat


