epaper
Tuesday, January 27, 2026
spot_img
epaper

బిగ్ బ్రేకింగ్ : మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది

కలం, తెలంగాణ బ్యూరో : Municipal Elections | రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికల నగారా మోగింది. సింగిల్ ఫేజ్‌లోనే ఎన్నికలు నిర్వహించేలా స్టేట్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూలు రిలీజ్ చేసింది. తక్షణం రాష్ట్రవ్యాప్తంగా (జీహెచ్ఎంసీ పరిధి మినహా) ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనున్నది. 13 న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. శివరాత్రి పండుగ, రంజాన్ ఉపవాసాల ప్రారంభం.. తదితరాలను దృష్టిలో పెట్టుకుని విడుదల చేసిన షెడ్యూలు ప్రకారం జనవరి 28న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, డీజీపీ, చీఫ్ సెక్రటరీ తదితరులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించిన తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని షెడ్యూలును ఖరారు చేశారు.

మొత్తం ఓటర్ల సంఖ్య 52 లక్షల 43 వేలు

Municipal Elections ఎలక్షన్ షెడ్యూలు ఇలా :

116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు
నోటిఫికేషన్ విడుదల : జనవరి 28
నామినేషన్లు స్టార్ట్: జనవరి 28
చివరి గడువు : జనవరి 30
స్క్రూటినీ : జనవరి 31
ఉపసంహరణ : ఫిబ్రవరి 03
పోలింగ్ : ఫిబ్రవరి 11
కౌంటింగ్ : ఫిబ్రవరి 13

పోలింగ్ కేంద్రాలు : 8,203

పోలింగ్ టైమ్ : ఉదయం 7.00 గం. నుంచి సాయంత్రం 5.00 గం. వరకు

Read Also: ఆ భేటీ రహస్యం కాదు : శ్రీధర్ బాబు క్లారిటీ

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>