కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా (Sangareddy) రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని రాయసముద్రం చెరువు (Rayasamudram Lake)ను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. రాయసముద్రం చెరువు బీహెచ్ఈఎల్ కు ఆనుకొని ఉంటుంది. దీంతో చెరువు సుందరీకరణను బీహెచ్ఈఎల్ యాజమాన్యం అడ్డుకుంటున్నదని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు రాయసముద్రం చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ఇప్పటికే మూడు సార్లు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేసినా, బీహెచ్ఈఎల్ యాజమాన్యం వైఖరి వలన పనులు ముందుకు సాగడం లేదని కార్పొరేటర్ పుష్ప నగేశ్ తెలిపారు. మరోవైపు రాయసముద్రం చెరువు (Rayasamudram Lake) కబ్జాకు గురవుతుందని, ఆక్రమణలు కాకుండా కాపాడాలని బీహెచ్ఈఎల్ అధికారులు హైడ్రాకు చెప్పారు. చెరువు ప్రజల ఆస్తి అని, సుందరీకరణ పనులు ఆపవద్దని, అభివృద్ధికి సహకరించాలని బీహెచ్ఈఎల్ అధికారులకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ (AV Ranganath) సూచించారు.
Read Also: వచ్చే ఎన్నికల్లో పోటీపై కోమటిరెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Follow Us On: Sharechat


