epaper
Tuesday, January 27, 2026
spot_img
epaper

మదర్​ ఆఫ్​ ఆల్​ డీల్స్​ పూర్తి: ప్రధాని మోదీ

కలం, వెబ్​డెస్క్​: భారత్​, యూరోపియన్​ యూనియన్ (ఈయూ)​ మధ్య చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (Mother of All Deals) కుదిరినట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ ఫ్రీ ట్రేడ్​ అగ్రిమెంట్​(ఎఫ్​టీఏ) దేశ చరిత్రలోనే అతిపెద్దదిగా ఆయన అభివర్ణించారు. యూరోపియన్​ కౌన్సిల్​ ప్రెసిడెంట్​ ఆంటోనియో కోస్టా, ఈయూ ప్రెసిడెంట్​ ఉర్సులా వాన్​డర్​ లేయెన్​తో కలసి ఆయన మాట్లాడారు. ‘ జనవరి 27న ఈయూలోని 27 దేశాలతో భారత్​ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఇది పెట్టుబడులను పెంచుతుంది. వాణిజ్య, సప్లయ్​ చైన్​లను ప్రపంచ స్థాయిలో బలోపేతం చేస్తుంది. ఇది కేవలం వాణిజ్య ఒప్పందం కాదు.. రెండు ప్రాంతాల ఉమ్మడి శ్రేయస్సును ప్రతిఫలించే ప్రణాళిక’ అని మోదీ (PM Modi) అన్నారు.

ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య బంధానికి ఈ ఒప్పందం ఒక మైలురాయి లాంటిదని పీఎం మోదీ పేర్కొన్నారు. ‘భారత్​, ఈయూ సంయుక్త జీడీపీ 25శాతం. అంటే ఇది ప్రపంచ జీడీపీలో ముప్పావు భాగం. ఇది కేవలం వాణిజ్య ట్రేడ్​ కాదు. రెండు ప్రాంతాల మధ్య ప్రజాస్వామ్యం, చట్టాలను పరిరక్షణలో భాగమయ్యే డీల్​’ అని ప్రధాని అన్నారు.

విన్​–విన్​ ట్రేడ్​: ఉర్సులా వాన్​డర్​ లేయెన్​

భారత్​, ఈయూ మధ్య ఒప్పందం చారిత్రాత్మకమని ఈయూ ప్రెసిడెంట్​ ఉర్సులా వాన్​డర్​ లేయెన్​ అన్నారు. ఈ ట్రేడ్​ను ‘మదర్​ ఆఫ్​ ఆల్​ డీల్స్​’(Mother of All Deals)గా పేర్కొన్న ఆమె.. ఎన్నో ఏళ్లుగా సాధ్యంకాని డీల్​ను సాధించినట్లు పేర్కొన్నారు. రెండు ప్రాంతాలకు ఈ ఒప్పందం విన్​–విన్ ​(సమాన గెలుపు) లాంటిదని ఆమె అన్నారు. ఈ ఒప్పందం దాదాపు 4 బిలియన్​ యూరోల మేర సుంకాల్లో కోత పెడుతుందని చెప్పారు. ఇది రెండు ప్రాంతాలకూ మేలు చేస్తుందన్నారు. ఈ సందర్భంగా భారత గణతంత్ర వేడుకలకు ఆహ్వానించినందుకు, ట్రేడ్​ డీల్​ కుదిరినందుకు ప్రధాని మోదీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. రిపబ్లిక్​ డే వేడుకలకు ముఖ్య అతిథిగా భారత్​కు రావడం జీవితాంతం గుర్తుండిపోయే గౌరవం, జ్ఞాపకం అని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

Read Also: సుప్రీంకోర్టు తీర్పు.. HCU విషయంలో అలా.. అహ్మదాబాద్ పై ఇలా

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>