నేపాల్‌లో లోయ‌లో ప‌డ్డ బ‌స్సు.. ఏడుగురు భార‌తీయులు మృతి

క‌లం, వెబ్ డెస్క్‌: నేపాల్‌ (Nepal)లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ప‌ర్యాట‌కుల‌తో వెళ్తున్న ఓ బ‌స్సు ప్ర‌మాదవ‌శాత్తు లోయ‌లో ప‌డిపోయింది. దీంతో బ‌స్సులో ఉన్న ప్ర‌యాణికుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వివ‌రాల్లోకి వెళ్తే… ప‌లువురు భార‌తీయులు ప‌ర్య‌ట‌న నిమిత్తం నేపాల్‌కు వెళ్లారు. మినీ బ‌స్సులో గోర్ఖా జిల్లాలోని షాహిద్ లఖన్ మున్సిపాలిటీ పరిధిలో కాంతార్ ప్రాంతంలో ప్ర‌యాణిస్తున్నారు. మనకమాన ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వ‌స్తుండ‌గా బ‌స్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్ర‌మాదంలో ఏడుగురు భారతీయ యాత్రికులు అక్కడికక్కడే మృతి చెందారు. బ‌స్సులో ప్రయాణిస్తున్న‌ మరో ఏడుగురికి తీవ్ర గాయాల‌య్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం అందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>