కలం, వెబ్ డెస్క్: మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. బీఆర్ఎస్ నేత పైలట్ రోహిత్ రెడ్డి సహా ఆరుగురికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని డ్రగ్స్‌తో భ్రష్టు పట్టించారని విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతోందని వెల్లడించారు. ఈ సందర్భంగా కేటీఆర్ (KTR)కు దమ్ముంటే డ్రగ్స్ టెస్టుకి రావాలని మహేశ్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. అసెంబ్లీలో డ్రగ్స్ టెస్ట్ పెడతామని, డ్రగ్స్ టెస్టుకి కేటీఆర్ రావాలని ఛాలెంజ్ విసిరారు. మరోవైపు ఇప్పటి వరకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎవరూ ఈ వ్యవహారంపై స్పందించలేదు.
Read Also: కవిత వర్సెస్ రంగనాథ్.. లీగల్ యాక్షన్ తీసుకుంటానని జాగృతి చీఫ్ వార్నింగ్
Follow Us On : WhatsApp

