కలం, వెబ్ డెస్క్: హైడ్రా (Hydraa) పేద ప్రజల పాలిట ఒక మహమ్మారి అని జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) విమర్శించారు. ఆదివారం మూసీ ప్రాజెక్టు గురించి కవిత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా హైడ్రాపై తీవ్ర విమర్శలు చేశారు. మూసీకి 30 మీటర్లలోపు ఇండ్లు ఉంటే కూలగొడతామని అంటున్నారని, దీనిపై ఈ మధ్య జాగృతి ఆధ్వర్యంలో ఓ నిరసన కార్యక్రమం చేశామని గుర్తు చేశారు. హైడ్రా ఆఫీసర్లు జాగృతి నిరసన తర్వాత నాలుగైదు వీడియోలు తయారు చేయించి ట్విట్టర్‌లో పెట్టారన్నారు. హైడ్రా మీద ఆరు కంప్లైంట్లు ఇచ్చినా ఎందుకు రంగనాథ్ (Ranganath) యాక్షన్ తీసుకోలేదని ప్రశ్నించారు. హైడ్రా అధికారులు పేదవాళ్లపై ప్రతాపం చూపిస్తూ పెద్దవాళ్లను కాపాడుతున్నారని ఆరోపించారు. హైడ్రా రాకముందు అనుమతులు ఇచ్చినట్లుగా చెప్పి తప్పించుకున్నారని విమర్శించారు.
2025లో అక్టోబరు 22న మూసీకి వరద వచ్చిన అంశాన్ని తహసీల్దార్‌కు రంగనాథ్ లేఖ రాశారని కవిత చెప్పారు. 0.37 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు వెల్లడించారు. నాలాను మూసివేసి ఆక్రమించడంతో మూసీకి వరద ముప్పు ఉందన్నారు. ఆదిత్య రియల్టర్ ప్రైవేటు ప్రాపర్టీని హైడ్రా ఎందుకు రక్షిస్తుందని ప్రశ్నించారు. మధు పార్క్ రిడ్జ్ (Madhu Park Ridge) అపార్టుమెంట్‌కు ఒక రూల్.. ఆదిత్యకు మరో రూలా? అని నిలదీశారు. జాగృతి ధర్నా చేస్తే కోర్టు ఆర్డర్ ఉందంటూ రంగనాథ్ అడ్డుకుంటున్నారని కవిత తెలిపారు. హైడ్రా తన అబద్ధపు వీడియోలను డిలీట్ చేయకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించారు. పేదోళ్లు గుడిసెలు వేసుకుంటే తీసేసే రంగనాథ్ ఆదిత్య నిర్మాణాలను ఎందుకు తొలగించడం లేదని కవిత ప్రశ్నించారు. ప్రజల పాత్ర లేకుండా మూసీ ప్రక్షాళన మంచిది కాదని, మూసీ బాగుపడాలని తానూ కోరుకుంటున్నానని కవిత (Kavitha) వెల్లడించారు. టోటల్ డీపీఆర్ వివరాలు వెల్లడించి ఎంత ఖర్చవుతుందో ప్రభుత్వం ఇప్పటికైనా స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Also: మూసీ వ్యయం.. 6నెలల్లో 1350 కోట్లు ఎలా పెరిగింది?: కవిత
Follow Us On: Instagram

