Mobile Popup Ad
Mobile Popup Ad

పుట్టా మ‌హేశ్‌ను టీడీపీ స‌స్పెండ్ చేయాలి: సీపీఐ నారాయణ

క‌లం, వెబ్ డెస్క్‌: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ టీడీపీ (TDP) ఎంపీ పుట్టా మహేశ్ కుమార్‌ (Putta Mahesh Kumar)ను త‌క్ష‌ణ‌మే పార్టీ నుంచి సస్పెండ్ చేయాల‌ని సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయణ(CPI Narayana) డిమాండ్ చేశారు. శనివారం రాత్రి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైల‌ట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో జ‌రిగిన డ్ర‌గ్స్ పార్టీపై పోలీసులు దాడులు చేశారు. ఈ పార్టీలో పాల్గొన్న వారికి డ్ర‌గ్స్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా న‌లుగురికి పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. వీరిలో టీడీపీ నాయ‌కుడు, ఏలూరు ఎంపీ పుట్టా మ‌హేశ్ కుమార్ కూడా ఉన్నారు.

దీనిపై నారాయ‌ణ స్పందిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎంపీ పుట్టా మహేశ్ డ్ర‌గ్స్‌ కేసులో దొరకడం ఆశ్చర్యం కలిగిస్తోంద‌న్నారు. ఏలూరు ఎంపీకి మొయినాబాద్ ఫామ్ హౌస్‌తో ఏం సంబంధం? అని ప్ర‌శ్నించారు. ఇలాంటి వాళ్లు ప్ర‌జా ప్ర‌తినిధులుగా ఉంటే చాలా న‌ష్ట‌మ‌ని వ్యాఖ్యానించారు. అసలు డ్రగ్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయ‌ని, ఎవరు తయారు చేస్తున్నార‌ని నారాయ‌ణ ప్ర‌శ్నించారు. డ్రగ్స్ మూలాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల‌ని నారాయ‌ణ కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>