కలం, వెబ్ డెస్క్ : 77వ రిపబ్లిక్ డే సందర్భంగా అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందరూ ఊహించినట్టే గతేడాది అంతరిక్ష యాత్ర పూర్తి చేసిన శుభాంశు శుక్లా(పైలట్)కు (Shubanshu Shukla) అశోక చక్ర పురస్కారం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అలాగే మేజర్ అర్షదీప్ సింగ్, ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, నైబ్ సుబేదార్ దోలేశ్వర్ సుబ్బాలకు కీర్తి చక్ర పురస్కారాలు వరించాయి. 13 మందికి శౌర్య చక్ర పురస్కారాలు, ఒకరికి బాట్ టు సేనా మెడల్, 44 మందికి సేనా మెడల్, ఆరుగురికి ఎన్ ఏవో సేనా మెడల్, ఇద్దరికి వాయు సేనా మెడల్ లను ప్రకటించింది కేంద్రం.


