ఆ సమస్య కారణంగానే తమన్‌ని తీసుకున్నాం : హరీశ్ శంకర్

కలం, సినిమా : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan), స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్‌లో తెరకెక్కిన బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ ” ఉస్తాద్ భగత్ సింగ్” (Ustaad Bhagat Singh). మైత్రీ మూవీస్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఉగాది సందర్భంగా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ మార్పు జరిగినట్లు చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు.

సినిమాకు మొదట సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్‌ (Devi Sri Prasad) ను తీసుకున్నప్పటికీ, టైమ్‌లైన్ సమస్యల కారణంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం తమన్‌ (Thaman) ను ఎంపిక చేసినట్లు ఆయన వెల్లడించారు. దేవి శ్రీ ప్రసాద్‌తో ఎలాంటి విభేదాలు లేవని హరీశ్ స్పష్టం చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్  సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దేవిశ్రీప్రసాద్  హాజరవుతారని హరీశ్ శంకర్ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>