Mobile Popup Ad
Mobile Popup Ad

నేడు వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం

కలం, వెబ్ డెస్క్ : నేడు (మార్చి 12, 2026) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)  16వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా  జరగనుంది. ఈ సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌ (YS Jagan) పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. పార్టీ స్థాపన నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ నాయకులు ప్రసంగాలు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించాలని పార్టీ కేంద్ర కార్యాలయం పిలుపునిచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>