Mobile Popup Ad
Mobile Popup Ad

నిజామాబాద్‌లో గ్యాస్ ఏజెన్సీలకు జనాల క్యూ!

క‌లం, వెబ్ డెస్క్‌: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్త‌త‌లు చ‌మురు ర‌వాణాపై తీవ్ర ప్ర‌భావం చూపెడుతున్నాయి. నిన్నటి వరకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల (Gas Cylinder) కొర‌త వేధించ‌గా తాజాగా డొమెస్టిక్ సిలిండ‌ర్ల‌కూ ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. యుద్ద ప్రభావంతో హోటల్స్, టిఫిన్ సెంటర్లు, టీ స్టాళ్ల‌కు సిలెండర్లు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. దీంతో వినియోగ‌దారులు తీవ్ర‌ ఆందోళన వ్య‌క్తం చేస్తున్నారు. వంట గ్యాస్ కోసం ముందే బుక్ చేసుకొని డబ్బులు కట్టినా ఇంటికి సరఫరా కావ‌డం లేద‌ని పేర్కొంటున్నారు. నిజామాబాద్‌ (Nizamabad)లో గ్యాస్ ఏజెన్సీల‌కు జ‌నం క్యూ క‌డుతున్నారు. ఫోన్ చేస్తే ఎవరూ రెస్పాండ్ అవడం లేదని, డ‌బ్బులు క‌ట్టినా సిలిండ‌ర్లు ఇవ్వ‌క‌పోవ‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>