కలం, వెబ్ డెస్క్: ఏపీలో ఫైళ్ల క్లియరెన్స్‌పై మంత్రులకు సీఎం చంద్రబాబు (CM Chandrababu) ర్యాంకులు ప్రకటించారు. ఈ ర్యాంకుల్లో మంత్రి అచ్చెన్నాయుడు మొదటి స్థానంలో నిలిచారు. ఇక చివరి స్థానంలో హోమంత్రి వంగలపూడి అనిత ఉన్నారు. అచ్చెన్నాయుడు తర్వాత వరుసగా నిమ్మల రామానాయుడు, టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్ నిలిచారు. మంత్రి అచ్చెన్నాయుడు ఫైళ్ల క్లియరెన్స్ (File Clearance)కు సగటున 5 గంటల 51 నిమిషాల సమయం తీసుకుంటున్నారని సీఎం వెల్లడించారు.
ఇక నిమ్మల ఫైళ్ల క్లియరెన్స్‌కు 9 గంటల 53 నిమిషాల సమయం తీసుకుంటున్నారు. టీజీ భరత్ 10 గంటల 11 నిమిషాలు, మంత్రి లోకేశ్ 26 గంటల 53 నిమిషాల సమయం తీసుకుంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫైళ్ల క్లియరెన్స్‌కు 42 గంటల 40 నిమిషాలు సమయం తీసుకుంటుండగా, హోం మంత్రి అనిత అందరికంటే ఎక్కువగా 105 గంటల 13 నిమిషాల సమయం తీసుకుంటున్నారు. గతంలో సైతం సీఎం చంద్రబాబు మంత్రులకు పని తీరు, ఆయా శాఖల్లో తీసుకొచ్చిన మార్పులు, పథకాల అమలు ఆధారంగా ర్యాంకులు ప్రకటించారు. ఈ సందర్భంగా ఫైళ్ల క్లియరెన్స్ వేగంగా జరగాలని సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించారు.

