కలం, వెబ్ డెస్క్: మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ (Aroori Ramesh) సొంత గూటికి చేరుకున్నారు. తెలంగాణ భవన్ లో బుధవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సమక్షంలో పార్టీలో చేరారు. బీఆర్ఎస్ (BRS) కండువా కప్పి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. రెండు రోజుల క్రితం ఆరూరి రమేష్ బీజేపీ(BJP)కి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అందరూ ఊహించినట్లుగానే తిరిగి బీఆర్ఎస్ చేరారు. ఆరూరి రమేష్ వర్ధన్నపేట్ నుంచి 600 కార్లతో భారీ ర్యాలీగా తెలంగాణ భవన్ కు వచ్చారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆరూరి రమేష్ బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. కానీ, నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులతో ఎక్కువ రోజులు బీజేపీలో ఉండలేకపోయారు. కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆరూరి రమేష్ (Aroori Ramesh) కాంగ్రెస్‌లో చేరతారని, కొందరు మళ్లీ బీఆర్ఎస్ వస్తారని కొందరు… ఇలా పలు ఊహాగానాలు మొదలయ్యాయి. చివరకు ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో నియోజకవర్గంలోని పార్టీ కేడర్‌లో ఉత్సాహం నెలకొంది.
Read Also: హనుమకొండ చౌరస్తాలో బహిరంగ చర్చకు సిద్ధమా కేటీఆర్..?
Follow Us On : WhatsApp


