కలం, మెదక్ బ్యూరో : డ్రగ్స్ మహమ్మారి నుంచి ప్రజలను చైతన్యం చేయాల్సిన ప్రజాప్రతినిధులే డ్రగ్స్ తీసుకోవడం బాధాకరమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) అన్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ ఎపిసోడ్, కాల్పుల ఘటనపై గజ్వేల్ లో ఆయన స్పందించారు. డ్రగ్స్ తీసుకున్న ప్రజాప్రతినిధులు ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారో ఆలోచించాలి అని సూచించారు. ఈగల్ టీం సోదాలకు వెళ్తే గన్ తో కాల్పులు జరిపారంటే ఎంత మత్తులో ఉన్నారో అర్థం అవుతుందని విమర్శించారు. మత్తు మందు ప్రభావం వారిపై ఎలా ఉందో ఈ ఘటనతో అర్థం చేసుకోవచ్చన్నారు. చట్టం ముందు ఎమ్మెల్యే, ఎంపీ ఎవరైనా సమానమేనని చెప్పారు. డ్రగ్స్ తీసుకున్న ప్రజాప్రతినిధులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. గన్ తో కాల్పులు జరిపిన వారిపై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ కి పంపాలని ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

